![]() |
![]() |
.webp)
యాంకర్ సుమ మంచి జోష్ మీద ఉంది. తన కొడుకు రోషన్ కనకాల నటించిన మూవీ బబుల్‌గమ్ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. తాజాగా ఒక భారీ ఈవెంట్ ని నిర్వహించి బబుల్ గమ్ యొక్క టీజర్ ను విడుదల కూడా చేశారు. ఈ ఈవెంట్ ని సుమ హోస్ట్ చేసింది. అలాగే రోషన్ కనకాల కూడా బుల్లితెర మీద వచ్చే షోస్ ద్వారా కనిపిస్తూ తనని తానూ ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇక రోషన్ అలా ఉంటే సుమ మరో పక్క తన కొడుకు మూవీలోని సాంగ్ కి డాన్స్ వేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఛిల్ల్ అవుతోంది. "బబుల్ గం" మూవీలో "హబీబి" అనే సాంగ్ కి తన పక్కన నలుగురు అసిస్టెంట్స్ ని పెట్టుకుకుని ఆ సాంగ్ ని రి క్రియేట్ చేసి డాన్స్ స్టెప్స్ వేసింది.
.webp)
"ఇలా మా అబ్బాయి రోషన్ నటించిన మూవీ నుంచి ఈ సాంగ్ ని రిక్రియేట్ చేసి స్టెప్స్ వేయడం చాల హ్యాపీగా ఉంది" అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఇక ఈ డాన్స్ చూసిన నెటిజన్స్ మాత్రం ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. "సుమ గారూ, మీరు, మీ గ్యాంగ్ డ్యాన్స్ అంటే కొరియోగ్రఫీ చేసి ప్రాక్టీస్ చేసిన స్టెప్పులు మాత్రమే కాదని, చాలా సరదాగా వచ్చిన స్టెప్స్ వేసి అందరి హృదయాల్ని కదిలించడమేనని నిరూపించారు..బాగుంది...ప్రతీ ఏడాది మీ బర్త్ డేకి ఏజ్ మైనస్ అవుతుంది అనుకుంటా ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉంటారు..నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. ఇప్పుడు నా కూతురు కూడా మిమ్మల్ని చూస్తోంది" అంటూ కామెంట్స్ చేస్తూ ఒక నెటిజన్ మాత్రం వెరైటీగా కామెంట్ చేశారు.."డాన్స్ ని డాన్స్ లా చేయండి..స్నాక్స్ లా కాదు" అన్నారు.. మరి సుమకి డాన్స్ రాకపోయినా వెనకాల కొంతమంది అసిస్టెంట్స్ ని వేసుకుని ఇలా అప్పుడప్పుడు సరదాగా స్టెప్స్ వేస్తూ వాళ్లకు నేర్పిస్తూ రీల్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.
![]() |
![]() |